మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను మొదట జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ వీలుపడలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ దీనిపై కూడా సందేహాలు ఉన్నాయి.
కాగా తాజాగా ఓ అప్డేట్ ఇస్తూ మేకర్స్ పవన్ కళ్యాణ్ మాసివ్ లుక్ ను రివీల్ చేశారు. భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతుందని చెప్తూనే… రిలీజ్ డేట్ ని త్వరలోనే చెప్తామని అనౌన్స్ చేశారు.
ఇక పవన్ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించగా థమన్ సంగీతం అందించారు.
Bheem Bheem Bheem Bheem… #BHEEMLANAYAK SONG LOADING!!🕺🔥
Release date update coming soon! ✨@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/faZzxogDy3
— Sithara Entertainments (@SitharaEnts) February 13, 2022