సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తున్నారు. అలాగే నిత్యమీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ రాబోతుంది. ఇప్పటి వరకు పవర్ తుఫాన్ చూశారు. ఇప్పుడు గెట్ రెడీ ఫర్…. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు సిద్ధంగా ఉండండి అంటూ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. కాగా.. ఇప్పటివరకు రానాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రానా గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.