పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు.
నిత్యమీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం నిర్వహించాలనుకున్నారు. కానీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా రిలీజ్ కు సంబంధించి మరో అప్ డేట్ రిలీజ్ చేశారు.
బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఒంటి నిండా గాయాలతో చేతిలో టీ పట్టుకుని కనిపించారు. ఇక ఫిబ్రవరి 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.