అనుకున్న సమయానికే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 25న థియేటర్స్ సందడి చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా నటిస్తుండగా రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు.
అలాగే నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ అన్ని కూడా ఈ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.
అయితే నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఫిబ్రవరి 25 న కూడా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని కొన్ని అనుమానాలు ఉండగా ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
ఫిబ్రవరి 25న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అని కన్ఫామ్ చేశారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా…సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.