పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ప్రతి సినిమాకు ఉన్నట్టుగానే ఈ సినిమాకి కూడా లీకుల బెడద తప్పలేదు. ఇప్పటికే కొన్ని వీడియోలు బయటకు రాగా… ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా పవన్ కి సంబంధించిన సన్నివేశమట. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.