సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ పై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఫిబ్రవరి 25 రిలీజ్ కు పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
ఇప్పటికే ఏప్రిల్ 1న సర్కారు వారి పాట, ఆచార్య సినిమాలు ఉన్నాయి. మరి వాటితో భీమ్లా నాయక్ పోటీ పడతాడా లేదా అనేది చూడాలి. పవన్ దీనితో పాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు.