సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
డిసెంబర్ 14 లేదా 15 వ తారీఖున ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ టీజర్ రానా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పవర్ ఫుల్ డైలాగ్ లతో నిండి ఉండనుందట. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.