పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 90 కోట్ల రూపాయలకు అమ్మారు. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఇది సెకెండ్ హయ్యస్ట్ నంబర్. కరోనా తర్వాత ఓ సినిమా ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.
మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ గా రావడం, స్వయంగా పవన్ కల్యాణ్ అందులో నటించడం, త్రివిక్రమ్ మాటలు అందించి, స్క్రీన్ ప్లే సమకూర్చడం, మరో కీలక పాత్రలో రానా కనిపించడం.. లాంటి అంశాలతో భీమ్లానాయక్ హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు తమన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ పోటీ ఏర్పడింది.
బయట బయ్యర్ల నుంచి చాలా ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినప్పటికీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలకు పర్మినెంట్ బయ్యర్లు ఉన్నారు. అందుకే భారీ ఆఫర్లు కూడా పక్కనపెట్టి, తమ రేంజ్ లో ఉన్నంతలో రేట్లు ఫిక్స్ చేసుకున్నారు. అయినప్పటికీ ఇవి భారీ మొత్తాలే. ఇక ఏరియా వైజ్, భీమ్లానాయక్ సినిమాకు జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం.
నైజాం – రూ. 35 కోట్లు
సీడెడ్ – రూ. 17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.2 కోట్లు
గుంటూరు – రూ. 7.2 కోట్లు
ఈస్ట్ – రూ. 6.4 కోట్లు
వెస్ట్ – రూ 5.6 కోట్లు
కృష్ణ – రూ. 6 కోట్లు
నెల్లూరు – రూ. 3.25 కోట్లు
ఏపీ + తెలంగాణ టోటల్ ప్రీ – రిలీజ్ బిజినెస్ రూ. 89.65 కోట్లు
ఓవర్సీస్ – రూ. 9 కోట్లు