ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈనెల 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాబోతున్నారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు.
నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
అలాగే ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.