పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మరో హీరోగా రానా కూడా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిజానికి మొదట ఈ సినిమాను 2 గంటల 45 నిమిషాలకు కట్ చేశారట. కానీ రన్ టైమ్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని భావించి మరో అరగంట పాటు కట్ చేశారట. ఫైనల్ గా ఈ సినిమా 2 గంటల 15 నిమిషాలకు సెట్ చేశారట.
మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో చూడాలి. ఇక మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.