సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్ లో రానా పవన్ మాస్ లుక్ లో కనిపించారు. ఇందులో రానా సరసన నటిస్తున్న సంయుక్త మీనన్, పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.