పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ ఫ్యాన్స్ ఎలాంటి మాస్ ను కోరుకుంటారో అలాంటి మాస్ ను చూపించారు మేకర్స్.
పవన్ కి అపొజిషన్ లో రానా కూడా అంతే బలంగా కనిపించారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కాక ముందు నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ రికార్డుల మోత ఖాయమంటూ కామెంట్లు పెడుతూ వచ్చారు.
అయితే ఫాన్స్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 500 కె లైక్స్ సాధించిన ట్రైలర్ గా భీమ్లా నాయక్ రికార్డు సృష్టించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా 1 గంట 20 నిమిషాలకు 500 కె లైక్స్ ని సాధించింది.
అలాగే వకీల్ సాబ్ 1 గంట 57 నిమిషాలకు సాధించింది. పుష్ప 11గంటల 44నిమిషాలకు సాధించింది. బాహుబలి 24 నాలుగు గంటల 33 మూడు నిమిషాలకు సాధించింది. భీమ్లా నాయక్ మాత్రం 33 నిమిషాల్లోనే 500 కే లైక్స్ ను సాధించి టాప్ పొజిషన్ లో నిలిచింది.