భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ అవ్వటం తో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్స్, ఫైట్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ మాస్ యాక్షన్ దానికితోడు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఎంత ఉందో మరోసారి ఈ ట్రైలర్ తో బయటపడింది. ఓ పెళ్లి మండపం లో ఏకంగా టీవీ ని పెట్టి ట్రైలర్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లికి వచ్చిన వారంతా ట్రైలర్ చూస్తూ కనిపించారు. ఇక ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా నిత్య మీనన్, సముద్రఖని, రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.