మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో నితిన్ సరికొత్త లుక్ లో రాబోతున్నారు. రష్మిక మందన్న నితిన్ తో మరోసారి జతకట్టబోతున్నారు.భీష్మలో వీరిద్దరి కెమిస్ట్రీ బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. ఈ నేపథ్యంలో నితిన్ కొత్తసినిమా మీద అంచనాలు పెరిగాయి.
నిజానికి నితిన్ సాలీడ్ హిట్ చూసి చాలా రోజులవుతుంది.భీష్మ సినిమా తర్వాత రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా.. సూపర్ హిట్ గా నిలువలేక పోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు.
ఈ క్రమంలోనే మరోసారి భీష్మ టీమ్ తో చేతులు కలిపాడు. భీష్మ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
భీష్మ రొమాంటిక్ , కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. లేటెస్ట్ గా ఉగాది సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నితిన్, రష్మిక, జీవి ప్రకాష్ వెంకీ కుడుములు కనిపించారు.
వెంకీ కథ అద్భుతంగా ఉంది. అంటే.. కామెడీ మూవీనా.. అని నితిన్, రొమాంటిక్ మూవీనా అని రష్మిక.. చలో, భీష్మ సినిమాల్లా ఉంటుందా అని జీవి ప్రకాష్ అడగ్గా.. కాదు ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంద్నాడు వెంకి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.