వచ్చే సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు బరిలో నిలిచాయి. జనవరి 12న భీమ్లా నాయక్, జనవరి 13న మహేష్ బాబు సర్కారు వారి పాట, జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే… ఈ రేస్ లోకి కొత్తగా ఆర్ ఆర్ ఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 12న ఈ చిత్రం ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.
నిజానికి ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న రాజమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పనులు మొదలెట్టారట. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే వచ్చే సంక్రాంతికి పోటీ మాములుగా ఉండదు.