పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రైట్స్‌ని దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త గట్టిగానే ముందుకు వచ్చారట.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ₹110 కోట్లకు చేరుకుందట. నైజాం హక్కులను సొంతం చేసుకోవడానికి దిల్ రాజు దాదాపు ₹35 కోట్లు ఆఫర్ చేశాడట. అలాగే మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర హక్కులను మొత్తం ₹53 కోట్లకు కొనుగోలు చేశారట.
అదే సమయంలో, ఇతర రాష్ట్రాల హక్కులు ₹9 కోట్లకు పలికాయట. ఓవర్సీస్‌లో మరో ₹9 కోట్లకు విక్రయించారట. ఓవరాల్‌గా, బిజినెస్ దాదాపు ₹105-107 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌కు ₹100 కోట్ల షేర్ మార్క్ చిత్రమనే చెప్పాలి. గతంలో వచ్చిన వకీల్ సాబ్ కరోనా మహమ్మారి కారణంగా థియేటర్‌లలో పెద్దగా రన్ కాలేదు. కానీ ఈ చిత్రం మొదటి రోజు షేర్‌లో దాదాపు ₹36 కోట్లు వసూలు చేసింది. ఇది పవన్ కెరీర్‌లో అత్యధిక షేర్‌గా నిలిచింది. మరి భీమ్లా నాయక్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.