సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 25 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అయితే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ సినిమా వచ్చిందంటే థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది పవన్ సినిమాకు ఇప్పుడు చిన్న హీరోలు పోటీకి వస్తున్నారు.
ఫిబ్రవరి 25న శర్వానంద్.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పీసీ 524 తో వస్తున్నాడు. ఇక వరుణ్ గని చిత్రం ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న రిలీజ్ కాబోతోంది. వీటన్నింటికీ తోడు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ప్రస్తుతం నడుస్తోంది. మరి ఈ పరిస్థితి లో సినిమా రిలీజ్ అవుతుందా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ 50% శాతం ఆక్యుపెన్సీ తీసేస్తే అప్పుడు రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.