పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ గత శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు మంచి కలెక్షన్స్ తో స్టార్ట్ చేసింది. ఆ తరువాత వారాంతంలో కూడా పవన్ స్టార్‌డమ్ కి తగ్గట్టు వసూళ్లు వచ్చాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా ‘భీమ్లా నాయక్’ స్పీడ్ అక్కడ కొద్దిగా తగ్గింది. అయితే, మొదటి వారాంతం తర్వాత, సోమవారం ఏ సినిమాకు అయినా కలెక్షన్లు సాధారణంగా పడిపోతాయి. కానీ భీమ్లా విషయంలో, కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. దీనితో కొనుగోలుదారులు పంపిణీదారులలో భయాందోళన నెలకొంది.
కానీ మంగళవారం శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తుకు చేరుకున్నాయి కలెక్షన్స్. మార్నింగ్ షోల నుంచి మెల్లగా మొదలైమిడ్ నైట్ షోల వరకు అన్ని చోట్లా మంచి వసూళ్లు వచ్చాయి. ఆ ఒక్కరోజే 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం విశేషం.
అమెరికాలోనూ అదే సీన్. సోమవారం కలెక్షన్లు తక్కువగా వచ్చినప్పటికీ మంగళవారం ఘనీయంగా పెరిగాయి. ఈ కలెక్షన్లతో పవన్ సినిమా 2.3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రెండున్నర మిలియన్ల దిశగా దూసుకుపోతోంది.