తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనలోని ప్రతి కూలతలను విడిచి పెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్నారు.
పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.
తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
పల్లెవాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్ జాగృతివారిని అభినందించారు. కాగా, భోగి వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి.