భోజ్ పురి సినీ నటి ఆకాంక్ష దూబే వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్ళ ఈమె సూసైడ్ భోజ్ పురి సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. ‘మేరీ జంగ్ మేరీ ఫైస్లా’ అనే చిత్రంతో సినీ ఆరంగేట్రం చేసిన ఈమె తన తాజా ప్రాజెక్ట్ కోసం ఇటీవలే వారణాసి చేరుకున్నట్టు తెలుస్తోంది. మూవీ షూటింగ్ అనంతరం ఈ నటికి స్థానిక సారనాధ్ హోటల్ లో బస కల్పించారు.
అయితే ఆదివారం ఉదయం ఈమె గదిలో ఈమెను విగతజీవిగా పోలీసులు కనుగొన్నారు. తన ఆత్మహత్యకు ముందు ఆకాంక్ష దూబే ఓ భోజ్ పురి పాటకు బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈమె మ్యూజిక్ వీడియో ‘ఏ ఆరా కభీ హారా నహీ’ త్వరలో విడుదల కానుంది.
ఈ సాంగ్ లో ఆమె పవన్ సింగ్ అనే మరో నటునితో కలిసి స్టెప్పులేసింది. కొంతకాలంగా ఆమె తన కో-స్టార్ సమర్ సింగ్ తో రిలేషన్ షిప్ కొనసాగించినట్టు తెలిసింది.
చిన్నతనంలోనే తన నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఆకాంక్ష దూబే బలవన్మరణం చెందడం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బహుశా సమర్ సింగ్ తో బెడిసి కొట్టిన రిలేషన్ షిప్ పర్యవసానంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.