మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ కూడా ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయట వచ్చింది. భోళా శంకర్ ఫస్ట్ లుక్ ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే వాగ్ ఆఫ్ భోలా ప్రీ లుక్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు అభిమానులు. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
వేదాళం రీమేక్ అయిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.