మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యంగ్ లుక్ లో పాత వైబ్స్ ని తీసుకొచ్చాడు దర్శకుడు. అతని చేతిలో త్రిశూల్ కీచైన్ పట్టుకుని కనిపించాడు. ఓవరాల్ గా భోళా శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తమిళ హీరో అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళా శంకర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా,హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.
ఇక మరోవైపు చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇక కొరటాల దర్శకత్వంలో తెరక్కబోతున్న ఆచార్య రిలీజ్ కు సిద్ధంగా ఉంది.