చంద్రబోస్ తన ‘నాటు’రచనతో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన లిరిసిస్ట్. ఆస్కార్ అందుకున్నా నేనెప్పుడూ మీవాడినే అంటూ తనను ప్రోత్సహించిన ఏ ఒక్కరినీ మర్చిపోకుండా ప్రతివారిని తన కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు.రెండు రోజుల క్రితం మర్యాద పూర్వకంగా సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వర్రావుని కలిసారు.
అదే క్రమంలో హైదరాబాద్లోని భోళా శంకర్ షూటింగ్కు హాజరై సెట్స్లో సందడి చేశారు. ఈ నేపథ్యంలో సెట్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ఆస్కార్ ప్రతిమను అందజేసి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఆస్కార్ ప్రతిమను అందుకున్న చిరంజీవి.. చంద్రబోస్ను అభినందించారు.
తర్వాత ‘భోళా శంకర్’ చిత్ర యూనిట్ సెట్లో చంద్రబోస్ను ఘనంగా సత్కరించారు. 95 ఏళ్ల ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం, ఆ అద్భుతమైన క్షణాలు చంద్రబోస్ ద్వారా తిరిగి పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చిరంజీవి తెలిపారు.
ఈ మేరకు భోళాశంకర్ సెట్లో చంద్రబోస్తో దిగిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. శరవేగంగా జరగుతున్న భోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్న స్టార్ ఇలా చంద్రబోస్ను సత్కరించడంపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.