మనమందరం సామాజిక న్యాయం, లింగ సమానత్వం గురించి మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు.
పురుషులతో పోల్చితే వివిధ ప్రైవేట్ రంగాల్లో వారికి అందుతున్న చెల్లింపు మాత్రం ఒకేలా ఉండటం లేదు. మహిళలపై వివక్ష చూపే పరిశ్రమలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి.
ఇదే విషయం గురించి మాట్లాడారు నటి భూమి పడ్నేకర్. ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో రెమ్యునరేషన్ ల గురించి మాట్లాడారు.
కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రెమ్యునరేషన్ తగ్గించుకోండని హీరోలకు నిర్మాత చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. అది జరగదు కూడా. కానీ అదే మహిళలకు మాత్రం తగ్గించుకోవాలని చెప్తారు. ఇది నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు భూమి ఫడ్నేకర్. భూమి పడ్నేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.