పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖుషి. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో భూమిక నడుమును పవన్ కళ్యాణ్ చూసిన సీన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతేకాదు కలెక్షన్ ల పరంగా కూడా మంచి వసూళ్లను కూడా సాధించింది. అయితే ఆ తరువాత వీరిద్దరు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆ తరువాత భూమిక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ వదినగా, అక్కగా రిఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు సినిమాకు దూరంగా ఉన్నాడు.
ఇప్పుడు పవన్ రీఎంట్రీ ఇచ్చేశాడు. వరుస సినిమాలను లైన్ లో పెట్టేసాడు. పింక్ సినిమాతో పాటు దర్శకుడు క్రిష్ తో కూడా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నారట. అందులో ఒకరు భూమిక కాగా ఇంకొకరి కోసం చూస్తున్నారని సమాచారం. సుమారు 19 సంవత్సరాలు తరువాత ఈ జంట మరో సారి జతకడుతుంది. దీనితో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య క్రిష్ ఏ విధమైన సన్నివేశాలను పెడతారేనేది ఆసక్తి రేపుతోంది.