హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ కస్టడీ ముగిసింది. కిడ్నాప్ కేసులో మూడు రోజుల పాటు ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
మరోవైపు పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. భార్గవ్ రామ్ తో పాటు గుంటూరు శ్రీనులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా దృవీకరించటం లేదు.
పోలీసు కస్టడీ ముగిసినందున… మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ దొరికే అవకాశం ఉన్నట్లు ఆమె తరుపు వారు అంచనా వేస్తున్నారు.