తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. రెండు నెలలుగా రోజూ 200లోపే కేసులు నమోదు కావడంతో ఇక ప్రమాదం ముగిసినట్టే అనుకున్నారు. కానీ మళ్లీ రాష్ట్రంలో ఉధృతి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దంపతులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. గండ్ర సతీమణి జ్యోతి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల తమను కలిసిన అధికారులు, పార్టీ కార్యకర్తలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొద్ది రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరారు.