‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో పాపులర్ అయ్యాడు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు మూవీతో ఊహించనంత రేంజ్ లో విజయ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘బిచ్చగాడు-2’ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
షూటింగ్ లో భాగంగా విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ వేగంగా వస్తూ ఎదురుగా ఉన్న పడవను ఢీకొట్టింది. అయితే ఆయన తీవ్రంగా గాయపడినట్టు ప్రచారం జరుగుతోంది.
విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఘటనపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, విజయ్ ఆంటోనీకి నడుముకు తేలికపాటి దెబ్బ తగిలిందని తెలిపారు.
అభిమానులు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని, విజయ్ ఆంటోనీ చెన్నై చేరుకున్నాడని వివరించారు. ప్రస్తుతం కోలుకుని తన సినిమా పనుల్లో పాల్గొంటున్నాడని పేర్కొన్నారు. దీంతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.