ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్,డీజిల్ కొనాలంటే ఆస్తులు అన్ని అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోని అన్ని సరిగా ఉన్నాయి.బండిలో పెట్రోల్ పోయించుకోవడానికి బంక్ కు వెళ్తే ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితులు.
తీరా అక్కడి వరకు వెళ్లిన తరువాత పెట్రోల్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. బ్లాక్‌లో పెట్రోల్ రేటు రూ.2500 కు అమ్ముతున్నారు. అంటే అసలు అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు.
రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్నఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిస్‌మార్కెట్ లో కిలో టమాటాలు రూ.150 కి అమ్ముతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.200, కిలో బంగాళదుంపలు రూ.220, కిలో క్యారెట్ రూ.490, పావుకేజీ వెల్లుల్లి రూ.160కి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
ఇదే సమయంలో పెట్రోల్ కష్టాల నుంచి బయటపడేందుకు సైకిల్‌ను ఆశ్రయిస్తున్నారు లంకవాసులు. దీంతో సైకిళ్ల ధరలు భారత్‌లో లభ్యమయ్యే అనేక బైక్ ధరలను క్రాస్ చేశాయి. అంతే కాదు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం లంకలో సైకిల్ కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది. డీజిల్,పెట్రోల్ కొరత కారణంగా సైకిల్ కోసం క్యూలు కడుతున్నారు లంకవాసులు.పెద్ద సైకిళ్లకైతే భారీ డిమాండ్ పెరిగింది.ఏకంగా ఒక్కొ సైకిల్ ధర లక్షన్నర దాటేసింది.
ఇంతకు ముందు వరకు రూ.50 వేల కే సైకిళ్లు దొరికేవి.ఇప్పుడు వాటి ధర ఏకంగా మూడింతలు పెరిగింది.
అయినప్పటికీ కొనుగోలు చేద్దామంటే అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లంకలో చిన్నపిల్లల సైకిళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు వ్యాపారులు.
కాగా..భారత్‌లో అనేక మోడల్స్ బైక్‌లు లక్షన్నరలోపే అందుబాటులో ఉన్నాయి. లంకలో మాత్రం..ఆ ధరకు సైకిల్ కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంధనకొరత తీవ్రంగా ఉన్నందున దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా నిలివేయడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని ప్రజలకుఅంబులెన్స్ సర్వీసుల వారు విజ్ఞప్తి చేస్తున్నారు.