అమెరికా అధ్యక్షుడు జో బైడన్ విలేకరులపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసభ్య పదజాలాన్ని వాడుతూ వివాదంలో చిక్కుకున్నారు. వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్ పై నోరుపారేసుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల మిడ్‌టెర్మ్ ఎలక్షన్స్ ఫలితాలపై ప్రభావం పడుతుందా అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ అడిగారు. దీంతో బైడన్ బూతు పురాణం ఎత్తుకున్నారు.
ద్రవ్యోల్బణం పెరగడం లాభమే అవుతోంది కానీ.. నష్టం ఎలా అవుతోందని తిరిగి ప్రశ్నలు వేస్తూ.. స్టుపిడ్ సన్ ఆఫ్ ఎ **’ అంటూ విరుచుకుపడ్డారు. బైడన్ మాటలకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. అయితే.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు కెమెరా, మైక్రోఫోన్లలో రికార్డ్ అయ్యాయి. బైడన్ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై వైట్ హౌస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ.. రిపోర్టర్‌కు బైడెన్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.
Democrats: Donald Trump’s attacks on the press are an attack on the First Amendment.
Joe Biden to Peter Doocy: “What a stupid son of a b*tch.”
Democrats: *silence* pic.twitter.com/csPv2yjNPb
— Lauren Boebert (@laurenboebert) January 24, 2022
రిపోర్టర్ పీటర్ డూసీని తన కార్యాలయానికి పిలుపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. బైడన్ ఫాక్స్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లపై ఇటీవల ఎక్కువగా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతవారం ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తొలి అడుగు వేసేంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని ఫాక్స్ న్యూస్ మహిళా విలేకరి అడగగా.. ఆమెపై కూడా మండిపడ్డారు. ఇదో చెత్త ప్రశ్న అంటూ తప్పించుకున్నారు.
తాజా ఘటనలో దూషించబడిన డూసీతో గతంలో కూడా బైడెన్ దురుసుగా మాట్లాడారు. ఆ రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ‘నువ్వు నన్ను ఎప్పుడూ మంచి ప్రశ్నలే అడుగుతావు’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దానికి ‘నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి’ అని డూసీ చెప్పగా.. ‘అవును.. నీ దగ్గర ప్రశ్నలు ఉంటాయి కానీ.. ఒక్కటి కూడా దేనికీ పనికిరాదని కొట్టిపారేశారు.