అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. దేశంలో గన్ కల్చర్ పెరిగిపోతుండటం అమెరికాను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో గన్ కల్చర్ కు ముగింపు పలికేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా చట్ట సభ్యులను కోరారు.
వైట్ హౌస్ నుంచి మాట్లాడిన ఆయన… ఇటీవల అమెరికాలో వరుస కాల్పుల ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ దేశం ఇంకా ఎన్ని మారణహోమాలను చూడాలి, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇకనైనా దేశంలో తుపాకులను నిషేధించాలి అని చట్టసభ్యులను ఆయన కోరారు. గన్ కల్చర్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు కీలకమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం తుపాకీ చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బైడెన్ సూచనలకు రిపబ్లికన్ సెనేటర్ల నుంచి మిశ్రమ స్పందన రావడంపై ఆయన ఆగ్రహించారు. ఒక వేళ ఆయుధాలను నిషేధించలేకపోతే కనీసం ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అర్హత వయస్సును 18 నుంచి 21కి పెంచుదాం అని అక్రోశం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు పాఠశాలలు హత్య స్థలాలుగా మారాయన్నారు. పాఠశాలను చూస్తే యుద్ధ భూమిని తలపిస్తున్నాయన్నారు. ఆయుధాల జారీ సమయంలో చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేలా చట్టాలను తీసుకువద్దామన్నారు.
అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 18000 మందికి పైగా తుపాకీ కాల్పుల్లో మరణించారని ఓ ఎన్ జీఓ తన నివేదికలో తెలిపింది. ఇందులో ఎక్కువగా ఆత్మహత్యలు, హత్య ఘటనలు ఉన్నట్టు ఎన్ జీఓ పేర్కొంది.