తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలేది లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. రివెంజ్ తీర్చుకుంటామని అన్నారు. పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని ఆర్మీని ఆదేశించారు. ఈనెల 31 కల్లా అఫ్గాన్ నుంచి తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకెళ్లిపోతామని చెప్పారు బైడెన్.
గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం బయట ఆత్మాహుతి దాడులు జరిపారు ఉగ్రవాదులు. వరుసగా రెండు పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల ధాటికి చాలా మంది శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఎయిర్ పోర్టు బయట ఎక్కడ చూసినా రక్తమే. తీవ్రగాయాలతో ప్రజలు హాహాకారాలు చేశారు. ఉగ్రదాడులు జరగొచ్చని అమెరికా ముందే తమ పౌరులను హెచ్చరించింది. అయితే ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి.