కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. దీనిపై డిసెంబర్ 2న ప్రకటన రాబోతుంది. హోమబుల్ ఫిల్మ్ సంస్థ ఈ మూవీని తెరకెక్కించనుంది.
ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. 2021 చివరి నాటికి షూటింగ్ పూర్తయ్యేలా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా… ప్రభాస్ త్వరలో ఆదిపురుష్ యూనిట్ తో జతకట్టనున్నారు.