జె.ఎన్.యులో విద్యార్ధులపై దాడికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవుతూ నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సున్నితమైన సమయంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు బాధితులకు సంఘీభావం తెలుపుతు అండగా నిలబడాలని ఆశిస్తారు. వారు ఇలాంటి దారుణాలను ఖండిస్తూ బాధితులకు మద్దతు నిస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తాయని..ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావని భావిస్తారు.
అయితే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతులు జోడించి దండం పెడుతున్న ఎమోజీ ట్వీట్ చేసి అందరిని అయోమయానికి గురి చేశారు. ఇది ఆందోళనను, గౌరవాన్ని సూచిస్తుందని కొందరనుకుంటుండగా…ఇది ప్రార్ధించడమని మరికొందరు భావిస్తున్నారు. ఇంకొందరైతే ఇది అభినందనలకు చిహ్నమని అర్ధం చేసుకుంటున్నారు. మొత్తమ్మీద అమితాబ్ పెట్టిన ఎమోజీ మాత్రం ఆయన ఏం చెప్ప దల్చుకున్నారో చెప్పకుండా నానా అర్ధాలకు దారి తీస్తుంది.