నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్ డీపీపీ)లో చేరారు.
పార్టీ నుంచి మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే పార్టీలో మిగిలారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగాల్సి వుండగా ఈ పరిణామం ఎన్పీఎఫ్ కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజా చేరికలతో ఎన్డీపీపీ మరింత బలపడింది. ప్రస్తుత చేరిన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో ఎన్డీపీపీ బలం 42కు చేరింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీపీపీ 42, బీజేపీ 12, ఎన్పీఎఫ్ 4, ఇద్దరు స్వంతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎన్పీఎఫ్ లెజిస్లేచర్ పార్టీకి చెందిన 21 మంది సభ్యులను ఎన్‌డీపీపీలో విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు తనకు అందినట్టు అసెంబ్లీ స్పీకర్ షరింగైన్ లోక్‌కుమర్ ఒక ప్రకటనలో తెలిపారు.