ఐపీఎల్ సీజన్ ఆక్షన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ… భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయ్ హజారె వన్డే ట్రోఫీలో ఆడనున్న ముంబై సీనియర్ టీంలో అర్జున్‌కు అవకాశం దక్కలేదు. ఈ నెల 20న జరిగే ఈ టోర్నీ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ నిన్న 22 మంది ఆటగాళ్లతో టీమ్‌ను అనౌన్స్ చేసింది. అందులో అతని పేరు లేదు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ముంబై సీనియర్ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు అర్జున్. కానీ ఆ టోర్నీలో ఆకట్టుకోలేకపోయాడు. ఒక మ్యాచ్ ఆడే చాన్స్ రాగా.. రెండు ఓవర్లు వేయగా.. 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దానికి ముందు కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విజయ్ హజారె ట్రోఫీ జట్టు నుంచి అర్జున్‌ను తప్పించారు. కాగా ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ వేలంలో అర్జున్ కూడా పేరు నమోదు చేసుకున్నాడు. అంతలోనే ఇలా జరగడం అతని పెద్ద దెబ్బేనంటున్నారు విశ్లేషకులు.