బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్, టీవీ నటుడు రవికృష్ణ మరోమారు వార్తల్లో నిలిచాడు. నవ్య స్వామితో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కథలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరు సెలబ్రిటీ గెస్టులుగా వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే షో సందర్భంగా వీరిద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీని బట్టి చూస్తే వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు అర్థమవుతుందని టాక్ నడుస్తోంది. ఇక షో సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసేందుకు ఎంతో ఇష్టపడతాం అని కూడా చెప్పడం.. ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మాత్రమే కాకుండా రవి పలు ప్రముఖ టీవీ సీరియల్స్‌లోనూ నటించాడు. వరూధిని పరిణయం, బావా మరదళ్లు, దటీజ్ మహాలక్ష్మి వంటి సీరియల్స్ లో రవి నటించాడు. అలాగే నవ్య స్వామి వాణి రాణి షోలో పాల్గొని అలరించింది. వీరిద్దరూ స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అనే షోలో కనిపించారు.
కాగా రవి కృష్ణ గత ఏడాది జూలై నెలలో కోవిడ్ బారిన పడ్డాడు. తనకు కోవిడ్ వచ్చిందని చెబుతూ తాను చికిత్స పొందుతున్నానని, తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని అప్పట్లో అతను మెసేజ్ పెట్టాడు. ఇక రవికృష్ణ ఇటీవలి కాలంలో నవ్య స్వామితో కలిసి కనిపిస్తుండడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ లవ్‌లో పడ్డారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై వారు స్పందిస్తారో, లేదో చూడాలి.