బిగ్ బాస్ 4 టైటిల్ గెలవకపోయినా… సోహైల్ కు రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ఓ రకంగా అభిమానుల మనస్సులో బిగ్ బాస్ గెలిచినంత స్పేస్ సంపాదించుకున్న ఈ సింగరేణి బిడ్డకు ఇప్పుడు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ వంటి సినిమాలను తీసిన అప్పిరెడ్డి సోహైల్ తో సినిమా చేయనున్నాడు.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ వినజంపాటి స్క్రిప్ట్ తో సోహైల్ ను కలిసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా షూట్ మొదలవ్వనుండగా… ఫిబ్రవరి వరకు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇందులో ఇతర నటీనటులు ఎవరు… బడ్జెట్ ఎంత అనే విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.