తెలుగులో ఇప్పుడున్న రియాల్టి షోలలో బిగ్ బాస్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. బిగ్ బాస్ ను విమర్శించే వారున్నప్పటికీ దాన్ని తలదన్నే ప్రొగ్రామ్స్ ఏవీ తెలుగులో లేకపోవటం స్టార్ మాకు కలిసొస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు వస్తున్న క్రేజ్ ను స్టార్ మా ఉపయోగించుకోవాలని చూస్తుంది.
ఇప్పటికే గంగవ్వకు ఓ హెల్త్ రిలేటెడ్ ప్రొగ్రాంలో తీసుకొగా… అవినాష్ కు కూడా ఆఫర్స్ ఇస్తుంది. సింగరేణి బిడ్డగా గుర్తింపు పొందిన సొహైల్ కు కూడా వరుసగా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ మోనల్ కు కూడా తాజాగా స్టార్ మా ఆఫర్ ఇచ్చింది. త్వరలో రాబోయే డాన్స్ షోకు ఆమెను జడ్జ్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటు బిగ్ బాస్ విజేత అభిజిత్, అఖిల్ ను సైతం రియాల్టి షోలకు గెస్ట్ లుగా రెగ్యూలర్ గా పిలవాలన్న నిర్ణయానికొచ్చారు. తద్వారా బిగ్ బాస్ నుండి వచ్చిన ఫేంను స్టార్ మా వాడుకోవాలని ప్లాన్ చేసినట్లుగా కనపడుతుంది.