కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సెలబ్రిటీలు తిరిగి ఉపాధిని వెతుక్కునే పనిలో ఉండటం వల్లే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అభిప్రాయపడ్డారు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సెలక్షన్ కూడా అంతగా బాలేదన్నారు.
ఇక పల్లెటూరి నుంచి వచ్చిన బామ్మ గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం ఓ అసాధారణ నిర్ణయమని అన్నారు. గంగవ్వ కనీసం ఒక పది వారాల పాటు హౌస్ లో కొనసాగుతారని భావిస్తున్నానని పేర్కొన్నారు. పల్లెటూర్లలో బిగ్ బాస్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. ఫిజికల్ టాస్క్ లో గెలిస్తే ఫైనల్ వరకు రావచ్చు అని ఎవరూ భావించ కూడదని, గీత మాధురి ఫిజికల్ టెస్ట్ లలో ఆధిపత్యం చూపకుండానే ఫైనల్ వరకు వచ్చిందని అన్నారు. అయితే ఈ సీజన్లో పోటీదారుల కోసం గ్రూపులు తయారయ్యాయని అన్నారు. అంతేకాకుండా కౌశల్ ఆర్మీ ర్యాలీ మాత్రం ‘నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ‘ వ్యాఖ్యలు చేశారు కౌశల్.