మూడు సీజన్లు కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ లోకి అడుగుపెడుతున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్. ఎప్పుడా ఎప్పుడా అని ప్రేక్షుకులు ఎదురుచూస్తున్న తరుణంలో సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ 4 ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా ట్వీట్ చేసింది.
కరోనా కారణంగా ఈ సీజన్ ఆలస్యంగా ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ ల విషయానికి వస్తే టీవీ9 దేవి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ దంపతులు, మై విలేజ్ షో గంగవ్వ, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, సింగర్ నోయల్ సేన్, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యాంకర్లు లాస్య, అరియానా, యూట్యూబరర్లు అలేఖ హారిక, మహబూబ్ దిల్‌సేలు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నట్లు సమాచారం.
మూడవ సీజన్ 3 హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున నే నాలుగో సీజన్ కి కూడా పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే బిగ్బాస్ సీజన్ ఫోర్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు నాకు మూడు పాత్రల్లో కనిపించారు.