హౌసులో పుల్లలు పెడుతున్నాడు బిగ్‌బాస్. దాంతో హౌస్మేట్స్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. నిన్నటివరకు కలిసిమెలిసి ఒక గ్రూపుగా ఉన్న వరుణ్ గ్రూపును బిగ్‌బాస్ బాగా టార్గెట్ చేశాడు. ఈ గ్రూపులో ఉన్న పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్‌లను విడగొట్టేందుకు ప్లాన్ చేశాడు. తన గురించి వితికా, వరుణ్, రాహుల్ గుసగుసలాడిన వీడియోలను కన్ఫెషన్ రూంలో పునర్నవికి సీక్రెట్‌గా ప్లే చేసి చూపించాడు. దాంతో నవీ తెగ ఫీలై బయటకొచ్చింది. వితికాతో డైరెక్ట్‌గా గొడవేసుకుంది. రాహుల్ దగ్గర తన బాధను వెళ్లగక్కింది. అలాగే, శ్రీముఖి గురించి పునర్నవి, రాహుల్, వితికా ఎలా గుసగుసలాడారో ఆ వీడియోని డైరెక్టుగా శ్రీముఖికే చూపించాడు. దాంతో ఆమె హర్టయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. విలన్‌గా మారి హౌసులో అన్‌రెస్ట్ క్రియేట్ చేయమని హిమజకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అలా చేస్తే ఇమ్యునిటీ ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు. దాంతో హిమజ రెచ్చిపోయి హౌస్‌లో అరాచకం సృష్టించింది. హౌస్‌మేట్స్ అందరికీ చుక్కలు చూపించింది. ఇదొక సీక్రెట్ టాస్క్ అని శ్రీముఖి కనిపెట్టేసింది. ఆమ్లెట్ తింటూ బాబా భాస్కర్ ఏదో అనడంతో ఆ ప్లేట్‌ను విసిరికొట్టింది హిమజా. అంతటితో ఆగకుండా లోపలున్న గుడ్లు తీసి నేలకోసి కొట్టింది. హిమజ బిహేవియర్ చూసి షాకైనట్టు చూసిన హౌస్మేట్స్ అసలు నువ్వేనా ఇలా ప్రవర్తించేది అంటూ హాశ్చర్యపోయారు. ఇదీ బిగ్‌బాస్ సీజన్ 3లో ఒక ఎపిసోడ్. ఇలావుంటే.. నాగ్ వీకెండ్ ఎపిసోడ్స్ అన్నీ చప్పగా వుంటున్నాయని బయట టాక్.. నిజానికి నానీ.. ఎన్టీఆర్ జూనియర్.. గత రెండు సీజన్లలో చెలరేగిపోయారు. కింగ్ మీద ‘స్టార్ మా’ ఎన్నో ఎక్ప్‌పెక్టేషన్స్ పెట్టుకుంది కానీ, మన్మధుడు టూ ఎఫెక్ట్‌తో సారు డల్‌గా వుంటున్నారని నెటిజెన్ల కమెంట్.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » వితికా వర్సెస్ పునర్నవీ !!! పుల్లలు పెడుతున్న బిగ్‌బాస్