రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. మరో ఆందోళనకర విషయం వెలుగుచూసింది. నాటి కార్యక్రమంలో పాల్గొన్న రైతుల్లో 100మందికి పైగా ఆచూకీ లేకుండాపోయారని పంజాబ్ మానవహక్కుల వెల్లడించడం కలకలం రేపుతోంది. ఆచూకీ లేకుండా పోయిన వారిలో ఒక్క తతారీవాలా గ్రామానికి చెందిన వారే 12 మంది రైతులు ఉన్నట్టు వెల్లడించింది.
మరోవైపు అదృశ్యమైనవారి జాబితాను రైతు సంఘాలు సిద్ధం చేస్తున్నాయి. ఒక్కొక్కరి వివరాలు అందుతున్నాయని.. వాటిని పరిశీలించి అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే నాటి ఘటనలో 50 మందిని నిర్బంధించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఆచూకీ లేని వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని వారు అంటున్నారు. పోలీసులే వారిని నిర్బంధించి తీహార్ జైలుకు తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.