మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కేసులు కంట్రోల్‌లోకి రావడం లేదు. దేశంలో సగానికి పైగా కేసులు ఇప్పటికీ ఈ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలవరపెడుతోంది.
గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 56,286 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అటు మరణాలు కూడా మహారాష్ట్రను కలవరపెడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 376 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గత 24 గంటల్లో 36,130 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
మహారాష్ట్రలో మొత్తం కేసులు: 32,29,547
యాక్టివ్ కేసులు: 5,21,317
కోలుకున్నవారు: 26,49,757
కరోనా మరణాలు: 57,028