విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను బాంబే హై కోర్టు ఆయనకు మంజూరు చేసింది. దాదాపు ఏడాది తర్వాత ఆయన విడుదల కానున్నారు.
ఏడాది క్రితం బీమా కోరెగావ్ కుట్ర కేసులో ఎన్ఐఎ వరవరరావును అరెస్టు చేసింది. జైలులో ఉన్న కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోనే ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇవాళ లేదా రేపు వరవరరరావు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
కాగా, 6 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు వరవరరావును ఆదేశించింది. అలాగే బెయిల్ ముంజూరైనప్పటికీ.. ముంబై విడిచి వెళ్లరాదని తెలిపింది.