భారత్‌పై కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా ప్రపంచంలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 96,982 కొత్త కేసులు వెలుగు చూసాయి. ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిన్న 446 మంది మరణించారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,26,86,049కి చేరింది. కొత్తగా 50,143మంది కోలుకోగా… మొత్తం రికవరీలు 1,17,32,279కు చేరాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య మొత్తం 1,65,547కు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,88,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేసులు పెరిగేకొద్దీ.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 8,31,10,926 చేరింది.