బుధవారంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో.. సమావేశాలను బుధవారంతో ముగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ లో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలను కొనసాగించలేని పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఈ నెల 28 వరకు సభ నిర్వహించాలని, అవసరం అయితే సమావేశాలు పొడిగించాలని మొదట నిర్ణయించారు. కానీ అనూహ్యంగా బుధవారం తో ముగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం.
అయితే… ప్రభుత్వం తను క్లియర్ చేయాలి అనుకున్న ప్రైవేట్ యూనివర్సిటీ, రెవెన్యూ, ఉద్యోగుల జీతాల కోత మొదలగు బిల్లులన్ని క్లియర్ చేసుకోవడంతో పాటు సెప్టెంబర్17ను అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో హౌస్ నిరవధిక వాయిదా కు సర్కార్ ఆలోచన చేస్తోందన్న ప్రచారం పై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
.