మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడి కుటుంబంపై వారి కుల పెద్దలు కుల బహిష్కరణ విధించారు. దీంతో ముగ్గురు కుల పెద్దలపై జనవరి 6 న శంకర్ అల్లదుర్గం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోవడంలేదని మనస్తాపానికి గురైన శంకర్.. నిన్న అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆవేదనను వీడియో రికార్డ్ చేసాడు. ఇది వైరల్ గా మారడంతో కుల పెద్దల నిర్వాకం, పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.