చంఢీగడ్ ప్రజలు ఇప్పటికే కొవిడ్ -19 వైరస్ తో వణికిపోతుండగా తాజాగా మరో భయం పట్టుకుంది. సోమవారం ఉదయం చిరుతపులి లాంటి ఓ జంతువు సంపన్నులు నివసించే సెక్టార్-5 రెసిడెన్షియల్ ఏరియాలో కనిపించింది. దీంతో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని పోలీసులు మైక్ ల ద్వారా హెచ్చరించారు. అది చిరుతపులి అని పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ వన్యప్రాణి కార్యకర్తలు మాత్రం అది చిరుతపులి అని నమ్మడం లేదు.
” చిరుతపులి కనిపించగానే…ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని మేము ప్రజలను కోరామని” సెక్టార్-3 పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.వో జస్పాల్ సింగ్ తెలిపారు. ఆ జంతువు ఓ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పారు. అయితే అది ఎవరిని గాయపర్చలేదన్నారు. చిరుత చూసిన వెంటనే వన్యప్రాణి కార్యకర్తలకు చెప్పాం..వారు దాన్ని పట్టుకునే పనిలో ఉన్నారన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది వెంటనే తెలియదన్నారు.
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఎడారిగా మారిన రోడ్ల వెంబడి ప్రమాదకరమైన జంతులు సంచరిస్తున్నాయని…ఆదివారం కొన్ని దుప్పులు సెక్టార్-5 లో రోడ్డును క్రాస్ చేస్తుండడం తాను చూశానిని ఎస్.హెచ్.వో తెలిపారు.