ప్రచారంలో చాలా రకాలుంటాయి. కానీ ఇది మరీ వింత ప్రచారం. ఇన్నాళ్లూ ఓ సినిమాకు హైప్ ఇవ్వడం చూశాం. కానీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఓ సినిమాకు సింపతీ క్రియేట్ చేసే ప్లానింగ్ తెరవెనక జోరుగా సాగుతోంది.
అదొక పెద్ద సినిమా. అందులో పెద్ద హీరో. ఒకప్పుడు ఆ హీరో సినిమా రిలీజ్ అంటే రాష్ట్రం మొత్తం మోత మోగిపోవాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్. తాజాగా ఆ హీరోకు భారీ ఫ్లాప్ వచ్చింది. ఇమేజ్ డ్యామేజ్ అయింది. విమర్శకులతో పాటు నెటిజన్లు ఆ సినిమాను ఏకి పడేశారు. దీంతో సదరు హీరో కార్నర్ అయ్యాడు.
కేవలం కార్నర్ అవ్వడమే కాదు, ఆయనగారి మార్కెట్ కూడా అమాంతం పడిపోయింది. అలా అని గతంలోలా లాంగ్ గ్యాప్ తీసుకునే పరిస్థితి లేదు. వెంటనే మరో సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, సినిమాకు హైప్ తెచ్చే పనులు చేసే కంటే సింపతీ క్రియేట్ చేయడం చాలా మంచిదని యూనిట్ భావించింది.
అనుకున్నదే తడవుగా రంగం సిద్ధమైంది. రిలీజ్ కు ముందు ప్రచారం, రిలీజైన మొదటి రోజు, మొదటి ఆట నుంచి సింపతీ జనరేట్ అయ్యేలా సోషల్ మీడియాను హోరెత్తించాలని యూనిట్ నిర్ణయించుకుంది. అయితే ఆ సింపతీ అనేది ఎలా జనరేట్ చేస్తారు, తర్వాత దాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తారనేది ఇక్కడ కీలకమైన అంశం.
ఏమాత్రం తేడా కొట్టినా సింపతీ కోసం చేసిన ప్రచారం కూడా ట్రోలింగ్ కు గురవ్వడం ఖాయం. అయితే ఏదైనా విషయాన్ని పద్ధతి ప్రకారం జనాలకు ఎక్కించడంలో, ఆ కాంపౌండ్ కు మంచి పేరుంది. ఈసారి కూడా సక్సెస్ ఫుల్ గానే తమ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడం ఖాయమంటున్నారు దగ్గర జనాలు.